VIDEO: వడగళ్ల వాన.. రైతుల ఆవేదన

VIDEO: వడగళ్ల వాన.. రైతుల ఆవేదన

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చంద్రధనలో శుక్రవారం వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలరాలగా, మామిడి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే పాడవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.