ప్రతి శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్ సెల్

ప్రతి శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్ సెల్

NLR: గూడూరులోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రతి శనివారం గ్రీవెన్ సెల్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను కార్యాలయంలో అర్జీల రూపంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కారిస్తామన్నారు.