హాజరు నమోదు కాక ఉపాధి కూలీలు అవస్థలు
ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీ కంజరి తోట గ్రామంలో ఉపాధి హామీ పనుల హాజరు నమోదు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గురువారం ఉపాధి కూలీలు తెలిపారు. సిగ్నల్ ఉన్నపటికీ సాంకేతిక సమస్య కారణంగా NMMS యాప్‌లో కూలీల ఫోటో అప్లోడ్ కావడం లేదని అన్నారు. దీంతో పాత మస్టర్ విధానమే హాజరు నమోదు చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారు.