WGL: ఇంట్లోకి నీరు చేరి వృద్ధురాలు మృతి

WGL: కాశికుంట ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కాశికుంటలోని ఓ ఇంట్లోకి నీరు చేరింది. ఈ క్రమంలో కింద నిద్రపోతున్న వృద్ధురాలు పసునూరి బుచ్చమ్మ (80) నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.