ఈ ప్రాంతంలో చిరుత సంచారం

ఈ ప్రాంతంలో చిరుత సంచారం

MBNR: గండీడ్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. మండల పరిధిలోని రెడ్డిపల్లి–మన్సూర్‌పల్లి గ్రామ శివారులోని చెరువు గట్టు వద్ద చిరుత పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలను గుర్తించి, అది ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.