ఎన్నాళ్లీ అవస్థలు..?

ఎన్నాళ్లీ అవస్థలు..?

PPM: పాచిపెంట నుంచి పద్మాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారిపై నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మురుగు, వాడుక నీరు వెళ్లే దారిలేక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ప్రవహిస్తోంది. దీంతో శిశుమందిర్ చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆలయాలకు వెళ్లే భక్తులు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థనికులు కోరుతున్నారు.