మండలంలో 144 సెక్షన్ అమలు: ఎస్సై
MHBD: కొత్తగూడ మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పార్టీ గుర్తులను ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో అన్ని దుకాణాలను మూసివేయలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల నియమాలు పాటించి, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.