VIDEO: 'రైతులకు పట్టాలు ఇవ్వండి'
NLR: CJFS భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని జనసేన పార్టీ ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ బుధవారం కోరారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీవో పావనీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.