బాపట్ల కలెక్టర్ వెంకట మురళి బదిలీ

BPT: బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గురువారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లా నుంచి బదిలీపై బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా డా.వినోద్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం బాపట్ల జిల్లాలో ఆకస్మిక వరదల్లో మునిగిన ప్రాంతాలను రక్షించడంలో కలెక్టర్ వెంకట మురళి విశేషంగా కృషి చేశారని ప్రజలు అన్నారు.