రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: జలదంకి సమీపంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కావలి నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్న పంచాయతీరాజ్ డీఈ మణికుమార్ నడుపుతున్న కారు, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.