అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: ముంపు సమయాల్లో రైతుల వెతలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామం వద్ద సైఫాన్‌ను అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ నిధుల నుండి రూ.2.34 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు.