విమానం గాల్లో ఉండగా టాయిలెట్లలో సమస్య..!

విమానం గాల్లో ఉండగా టాయిలెట్లలో సమస్య..!

బాలి నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లున్న విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్లలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు నీళ్ల బాటిళ్లలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు విమాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వర్జిన్ ఆస్ట్రేలియా అనే సంస్థ క్షమాపణలు చెప్పింది.