కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. గుంతలో పడిన కారు

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. గుంతలో పడిన కారు

GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల - అయిజ రహదారిలోని మెలచెర్వు చౌరస్తాలో రోడ్డు పనుల కోసం తవ్విన లోతైన గుంతలో, తాగునీటి పైప్‌లైన్ పగిలి నీరంతా చేరడంతో రోడ్డు కనిపించకుండా మారింది. దీంతో వాహనదారులు గమనించకుండా వెళ్లి ఓ కారు, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ గుంతలో పడిపోయారు. అక్కడే ఉన్న జేసీబీ సహాయంతో బుధవారం కారును బయటకు తీశారు.