కొమరాడలో సంచరించిన ఏనుగుల గుంపు
PPM: కొమరాడ మండలం పులిగుమ్మి పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరిస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లకూడదని, ఏనుగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ఏనుగుల కదలికలపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.