లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం

లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం

RR: ఈనెల 13న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం పోలీస్ అధికారులతో షాద్‌నగర్ కోర్టు న్యాయమూర్తులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా పోలీసులు ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ సీఐ విజయ్ కుమార్, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.