మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీ: బండి సంజయ్

మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీ: బండి సంజయ్

కరీంనగర్: భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్‌లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.