ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
VKB: జిల్లా మోమిన్‌పేటలోని మంగళవారం ఆర్కతల్లో దారుణం జరిగింది. శేఖర్ (32) వెంచర్‌లో కూలి పనికి వచ్చాడు. అదే వెంచర్‌లో పని చేస్తున్న ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి శేఖర్, మరొకరిపైకి దూసుకెళ్లింది. శేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108, పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేశారు.