VIDEO: సౌదీలో ఇసుక తుపాను బీభత్సం

సౌదీ అరేబియాలో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. రియాద్‌తో సహా జజాన్, అసీర్, అల్ బహా, మక్కా, అల్ ఖాసిమ్ ప్రాంతాలను గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుపాను కమ్మేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. రియాద్‌లో అయితే ఆకాశం దుమ్ముతో కమ్ముకుని, ఊరిని ముంచెత్తేలా కనిపించింది.