తాడేపల్లిలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం
GNTR: తాడేపల్లి పరిధిలో పలువురుకి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నేతలు గురువారం లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి అందజేశారు. ఉండవల్లికి చెందిన మసిపోగు భాగ్యరాణికి రూ. 62,988,పెనుమాకకు చెందిన మజీద్ బీకి రూ. 58,000, మరియకృపకి రూ. 25,350లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు పాల్గొన్నారు.