మంత్రిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే

మంత్రిని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ గురువారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ను ఈ విషయాన్ని హ్యామ్ (HAM) ప్రాజెక్టులో చేర్చాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.