అసెంబ్లీ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ
GNTR: నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ ఆదివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు, ఈనెల 18న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్‌లు, ఎమ్మెల్యేల రాకపోకలు, భద్రత తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.