అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బంపర్ ఆఫర్..!
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేద కుటుంబంలో ఎవరైనా మహిళా డెలివరి సమయంలో అడపిల్ల పుడితే రూ.5000 పోస్టాఫీసులో డిపాజిట్ చేసి,18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లికి రూ.30,000 అందిస్తామన్నారు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు సర్పంచ్ కి వచ్చే నెల జీతం మొత్తం చెల్లిస్తామన్నారు.