ఎల్లమ్మ కుంటలో బాలుడి అదృశ్యం
NZB: మోపాల్ మండలం ఎల్లమ్మ కుంట గ్రామానికి చెందిన బాదావత్ కార్తీక్ అదృశ్యమైనట్లు ఎస్సై సుష్మిత శనివారం తెలిపారు. బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ నెల 5వ తేదీనస్కూలుకువెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల బంధువుల ఇంట్లో వెతికినా దొరకకపోవడం మిస్సింగ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.