కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల రిజిస్టర్లను పరిశీలించి మౌలిక సౌకర్యాలు, భోజన నాణ్యతను పరిశీలించారు. హాస్టల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధ్యాపకులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.