ATM మార్చి నగదు కాజేసిన కేటుగాడు
VZM: ఏటీఎంలో డబ్బులు తీయడం రాక గుర్తుతెలియని వ్యక్తికి కార్డు ఇచ్చి రూ. 13 వేలు పోగొట్టుకొన్న ఘటన ఈనెల 12న జరిగింది. ఆనందపురం మండలం కొనవానిపాలెం గ్రామానికి చెందిన ఎస్.శ్రీను వ్యక్తిగత పనిమీద కొత్తవలస వచ్చాడు. డబ్బులు తీయడానికి ప్రయత్నించాడు. ఎలా తీయాలో తెలియక అక్కడ ఉన్న వ్యక్తికి కార్డు ఇచ్చారు. బాధితుడు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశామన్నారు.