VMRDA కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తేజ్ భరత్
VSP: విశాఖ VMRDA నూతన కమిషనర్‌గా ఎన్. తేజ్ భరత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన సంస్థ చైర్మన్ ఎం. ప్రణవ్ గోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌తో VMRDA పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత కార్యకలాపాలపై ఆయన చర్చించారు.