VIDEO: ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
SKLM: ఆమదాలవలసలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద 16వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నియోజకవర్గ ఇంఛార్జ్ చింతాడ రవి కుమార్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ముందుగా వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతోందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.