భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!
NTR: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్ బాటిళ్లు, 325 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది.