'రైతులకు రుణమాఫీ ప్రతిపాదన లేదు'
కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే సాయం, PM కిసాన్ నిధులు, తక్కువ వడ్డీకే లోన్లు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూచీకత్తు లేని లోన్ల పరిమితిని రూ.2 లక్షలకు పెంచామని వివరించారు.