తిరుమల శ్రీవారికి వెండి గంగాళం విరాళం
AP: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు శ్రీవారికి రూ.30 లక్షల విలువైన 22 కిలోల వెండి గంగాళాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న ఆలయ అధికారులకు గంగాళాన్ని అందజేశారు. దాతను టీటీడీ ఆలయ అధికారులు సన్మానించారు.