కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

SRD: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ.. కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.