బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు

KMM: గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని పలు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ బృందాలు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ ACP సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, ముదిగొండ, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరులోని పలు గ్రామాల్లో బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి రూ. 4 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నారు.