రామాలయాన్ని నిర్మించి తీరుతాం: డిప్యూటీ స్పీకర్

రామాలయాన్ని నిర్మించి తీరుతాం: డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు పెదపేటలో హిందూమత అభిమతం మేరకు రామాలయ నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పెదఅమిరంలోని కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఆ స్థలం రామాలయానికి చెందిందని అధికారులు నిర్ధరణ చేశారన్నారు. సుమారు రూ.80 లక్షలతో, పూర్తిగా ప్రజల విరాళాలతో అత్యంత సుందరంగా కృష్ణ శిలలతో దీని నిర్మాణం చేపడతామన్నారు.