పాకిస్తాన్ జాతీయులను గుర్తించాలని వినతి

SRD: సంగారెడ్డి పట్టణంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను గుర్తించి వారి దేశానికి పంపించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం సమర్పించారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు పాకిస్తాన్ జాతీయులని వెంటనే గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మురళీధర్, గోవింద్ బాబ పాల్గొన్నారు.