కోడిపందాలకు పశ్చిమగోదావరి జిల్లా సన్నద్ధం
పశ్చిమగోదావరి జిల్లా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలకు ప్రసిద్ధి చెందింది. పందెం రాయుళ్లు ఈసారి కూడా కోడిపందాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే, పోలీసులు ముందస్తుగా ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని సమాచారం. మరోవైపు, జిల్లాలో రాజకీయ నేతలు కోడిపందాల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.