'ప్రజల ఓట్లు తొలగించడం రాజ్యాంగ విరుద్ధం'

BDK: ఓట్ల గల్లంతుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం కొత్తగూడెం టౌన్‌లో సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బిహార్‌లో అధికారంలోకి రావడం కోసం తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.