ATM తరహా క్విక్ ప్రింట్ మెషిన్లు వచ్చేశాయ్
TG: హైదరాబాదీల కోసం జిరాక్స్ షాపులతో పనిలేకుండా ATM తరహా క్విక్ ప్రింట్ మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద వీటిని ఏర్పాటు చేశారు. QR కోడ్ స్కాన్ చేసి, ఫైల్ అప్‌లోడ్, ఆపై డబ్బులు చెల్లిస్తే క్షణాల్లో ప్రింట్లు వస్తాయి. వీటిని నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.