VIDEO: 'కోటి సంతకాల' ముగింపు కార్యక్రమంలో ఉద్రిక్తత
ELR: పెదవేగి మండలం కొండలరాయుడుపాలెంలో మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. 'కోటి సంతకాల' ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు దెందులూరు వెళుతుండగా అనుమతి లేదంటూ పోలీసులు నిలుపుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని అబ్బయ్య చౌదరి పోలీసులను ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.