అదుపుతప్పి బురదలో కూరుకుపోయిన స్కూల్ బస్సు
NLG: మిర్యాలగూడ పట్టణం అగ్రిగోల్డ్ కాలనీ వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పింది. దీంతో స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుని ఓవైపునకు ఒరిగింది. ఉదయం స్కూలు పిల్లలను ఎక్కించుకొని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే బస్సులో ఉన్న పిల్లలను కిందికి దింపి మరొక బస్సులు స్కూలుకి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.