ప్రభుత్వ ఆసుపత్రిలో చల్లని త్రాగునీటి సౌకర్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో చల్లని త్రాగునీటి సౌకర్యం

కృష్ణ: అవనిగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చల్లని త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. దాతల సాయంతో రెండు మంచినీటి కూలర్లను ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ఈ సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెడబలిమి జయకుమార్, అభివృద్ధి కమిటీ సభ్యులు తుంగల వెంకటగిరి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.