ఒంగోలులో రేపు జాబ్ మేళా

ప్రకాశం: ఒంగోలు మండలం త్రోవగుంటలోని ఐటీఐలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కరస్పాండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ దివీస్ ల్యాబొరేటరీ, తదితర కంపనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఐటీఐ, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.