IBPS పరీక్షలో నజియా నిషాత్ ప్రతిభ
SRD: కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన నజియా నిషాత్ అనే యువతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించి క్లర్క్‌గా ఎంపికైంది. పేద కుటుంబం నుంచి, తల్లి ప్రోత్సాహంతో కోచింగ్ లేకుండా ఉద్యోగం సాధించి, సెంట్రల్ బ్యాంక్ PO తర్వాత ఎస్‌బీఐ క్లర్క్‌గా ఎంపికై ప్రేరణ అయ్యింది.