నందిగామలో ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు

NTR: నందిగామలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. సర్వేపల్లి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు.