మున్సిపల్ ఛైర్మన్ ఎవరు.. ఆసక్తిగా చూస్తున్న ప్రజలు..!

మున్సిపల్ ఛైర్మన్ ఎవరు.. ఆసక్తిగా చూస్తున్న ప్రజలు..!

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. మున్సిపల్ పరిధిలో 16 వార్డులు ఉండగా, 2 ఎస్టీ, 3 ఎస్సీ, 3 జనరల్, 5 జనరల్ మహిళలు, 3 బీసీలకు కేటాయించారు. ఈసారి మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్ జనరల్ లేదా జనరల్ మహిళకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి తీవ్ర పోటీ నెలకొంది.