ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలు
MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు పెరుగుతున్నాయి. రామంతాపూర్, నాగోల్, బోడుప్పల్ ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటం, కాల్స్ తరచూ డ్రాప్ అవటం, 4G–5G ఇంటర్నెట్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉండటం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. సాయంత్రం సమయంలో నెట్‌వర్క్ ట్రాఫిక్ అధికంగా ఉండటం వల్ల సమస్య మరింతగా కనిపిస్తోందని స్థానికులన్నారు.