మఖ్దూం భవన్‌కు సురవరం పార్థివదేహం

TG: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి మఖ్దూం భవన్‌కు తరలించారు. నేతలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక ఆయన పార్థివదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.