కొలిమిగుండ్లలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

కొలిమిగుండ్లలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు 53వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో దస్తగిరి బాబు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడని ఎంపీడీవో అన్నారు.