ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
WGL: నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసిన మహానీయుడు అంబేద్కర్ అని వారు కొనియాడారు.