VIDEO: మూసీనది వరదల్లో కొట్టుకుపోయిన యువకుడు

RR: రాజేంద్రనగర్ సన్ సిటీ ఆర్మీ సమీపంలోని మూసీనదిలో భారీ వరదలలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని కనిపించిన అతడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.