VIDEO: డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ
KDP: పులివెందుల మినీ సచివాలయంలో గల డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ లతారెడ్డి, డీడీవో విజయలక్ష్మి ప్రారంభించారు. వారు కార్యాలయాన్ని సందర్శించి విభాగానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈ కొత్త కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు.